సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొత్త సచివాలయంలో తొలి క్యాబినెట్ భేటీ

First Cabinet meeting in new secretariat
ఇటీవలే తెలంగాణ నూతన సచివాలయం ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చాక ఇప్పటివరకు క్యాబినెట్ భేటీ జరగలేదు. ఈ నేపథ్యంలో, ఈ నెల 18న సీఎం కేసీఆర్ అధ్యక్షతన నూతన సచివాలయంలో తొలి క్యాబినెట్ భేటీ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, చివరిసారిగా తెలంగాణ క్యాబినెట్ భేటీ మార్చి నెలలో జరిగింది.
Go Back to Shorts
Telangana Cabinet
Meeting
New Secretariat
CM KCR
BRS
Hyderabad
Telangana

More Telugu News