nikhil: అందుకే అమిత్ షా పిలిచినా వెళ్లలేదు: హీరో నిఖిల్

That why Nikhil not met Home Minister AMit Shah

  • రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అమిత్ షా పిలిస్తే వెళ్లలేదని వ్యాఖ్య
  • ఆహ్వానించినందుకు అమిత్ షాకు నిఖిల్ థ్యాంక్స్
  • ఏ పార్టీకి అనుకూలంగా సినిమాలు చేయడం లేదని వ్యాఖ్య

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు తనకు ఆహ్వానం అందిందని, కానీ ఇలాంటి సినిమాలు (సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో వస్తున్న స్పై సినిమా) తీస్తున్న సమయంలో రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదనే ఉద్దేశ్యంతో తాను వెళ్లలేదని ప్రముఖ తెలుగు హీరో నిఖిల్ అన్నారు. తనను ఆహ్వానించినందుకు అమిత్ షాకు థ్యాంక్స్ చెప్పారు. నిఖిల్ హీరోగా గ్యారీ దర్శకత్వంలో స్పై సినిమా టీజర్ విడుదలైంది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదన్నారు. జెండాలు, అజెండాలు లేవని చెప్పారు. తాను ఏ పార్టీకి అనుకూలంగా సినిమాలు చేయడం లేదన్నారు. ఒక భారతీయుడిగా సినిమా తీస్తున్నట్టు చెప్పారు. కేంద్రమంత్రులతో పాటు ప్రతిపక్ష నాయకులకు స్పై సినిమాను చూపిస్తామన్నారు.

More Telugu News