YS Vivekananda Reddy: హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి వివేకానంద కూతురు

YS Viveka daughter to hyderabad cbi office
  • సునీతతో పాటు సీబీఐ కార్యాలయానికి భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి
  • సీబీఐ అధికారుల నుండి వారికి పిలుపు!
  • భాస్కర రెడ్డి డ్రైవర్ కు సీబీఐ నోటీసులు
హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత, భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చారు. వారిని సీబీఐ అధికారులు పిలిచినట్లుగా తెలుస్తోంది. వైఎస్ వివేకానంద హత్యకు సంబంధించిన కేసులో వివిధ అంశాలపై ప్రశ్నించేందుకు వారిని పిలిచినట్లుగా తెలుస్తోంది. అంతకుముందు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీన విచారణకు రావాలని పిలిచింది. ఆయన ఈ రోజు విచారణకు రావాల్సి ఉంది. నాలుగు రోజుల గడువు కోరడంతో సీబీఐ సానుకూలంగా స్పందించింది. మరోవైపు, భాస్కర రెడ్డి డ్రైవర్ కు కూడా సీబీఐ నోటీసులు పంపించింది.
YS Vivekananda Reddy
sunitha
rajasekhar reddy

More Telugu News