Bellamkonda Ganesh: 'నేను స్టూడెంట్ సర్' నుంచి హుషారైన బీట్!

  • బెల్లంకొండ గణేశ్ హీరోగా 'నేను స్టూడెంట్ సర్'
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • కథానాయికగా 'అవంతిక' పరిచయం
  • జూన్ 2వ తేదీన సినిమా రిలీజ్   
Nenu Student Sir lyrical song released

తెలుగు తెరకి 'స్వాతిముత్యం' సినిమాతో పరిచయమైన బెల్లంకొండ గణేశ్, ఆ తరువాత 'నేను స్టూడెంట్ సర్ ' సినిమాను చేశాడు. సతీశ్ వర్మ నిర్మించిన ఈ సినిమాకి, రాఖి దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా ఈ పాటికే విడుదల కావలసింది .. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి విష్వక్సేన్ చేతుల మీదుగా ఒక పాటను విడుదల చేశారు. '24/7 ఒకటే ధ్యాస .. గుండెలోపలే ఉందొక ఆశా' అంటూ ఈ పాట సాగుతోంది. మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీహర్ష సాహిత్యాన్ని అందించగా, బెన్నీ - మహతి స్వరసాగర్ ఆలపించారు. 

 ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా, బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు 'అవంతిక' కనిపించనుంది. ఈ సినిమాతోనే కథానాయికగా ఆమె ఇక్కడ పరిచయం కానుంది. ఆమె ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జూన్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News