Cheekoti Praveen: పట్టాభి ఓ పనికిమాలిన వాడు: విరుచుకుపడిన చీకోటి ప్రవీణ్

Cheekoti Praveen fires on TDP leader Pattabhi
  • ఇటీవల థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ ఆరోపణలో చీకోటి అరెస్ట్
  • బెయిల్ పై విడుదల
  • పట్టాభికి పిచ్చెక్కిందన్న చీకోటి ప్రవీణ్  
  • వాడేం మాట్లాడతాడో వాడికే తెలియదని విమర్శలు
ఇటీవల థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయి, బెయిల్ పై విడుదలైన చీకోటి ప్రవీణ్ తాజాగా టీడీపీ నేత పట్టాభిరామ్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. టీడీపీలో ఎవరైనా పనికిమాలిన వాడు ఉన్నాడంటే అది పట్టాభి అని విమర్శించారు. వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు, వాడేం అలిగేషన్ పెడతాడో వాడికే తెలియదు అని అన్నారు. 

"నేను థాయ్ లాండ్ కు పర్సనల్ గా వెళితే... దాన్ని తీసుకువచ్చి కొడాలి నాని, వల్లభనేని వంశీ, జగన్ గారికి అంటకడుతున్నాడు. పట్టాభికి పిచ్చెక్కింది. థాయ్ లాండ్ లో అరెస్టయిన వాళ్లకు మూడేళ్ల జైలు శిక్ష, ఐదేళ్ల జైలు శిక్ష అని గగ్గోలు పెట్టాడు... కానీ ఆ తెల్లారే మేం వచ్చేశాం. చీకోటి అంటే చాలు పట్టాభి ప్రెస్ మీట్ కోసం స్టేజి ఎక్కుతున్నాడు. తానేం మాట్లాడుతున్నాడో, దానికి ఓ అర్థం ఉందో లేదో అని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అలాంటి యూజ్ లెస్ ఫెలోస్ గురించి మాట్లాడడం కూడా వేస్ట్" అని చీకోటి ప్రవీణ్ వ్యాఖ్యానించారు.
Cheekoti Praveen
Pattabhi
TDP
Andhra Pradesh

More Telugu News