హైదరాబాద్ లోని మహమ్మద్ సిరాజ్ ఇంటికి ఆర్సీబీ టీమ్.. వీడియో
- ఫిల్మ్ నగర్ లో ఉన్న ఇంటికి విచ్చేసిన బెంగళూరు జట్టు సభ్యులు
- డిన్నర్ కు ఆహ్వానించిన మహమ్మద్ సిరాజ్
- విరాట్ కోహ్లీ తదితరుల రాక
ఆర్సీబీ జట్టులో కీలక సభ్యుడైన మహమ్మద్ సిరాజ్ తన టీమ్ సభ్యులు అందరినీ కొత్తగా కట్టుకున్న ఇంటికి ఆహ్వానించాడు. దీంతో సోమవారం రాత్రి ఆర్సీబీ టీమ్ హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో ఉన్న మహమ్మద్ సిరాజ్ నివాసానికి చేరుకుంది. ఇందుకు సంబంధించి వీడియోని ఒక అభిమాని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశాడు. ఆర్సీబీలో కొత్తగా చేరిన కేదార్ జాదవ్ కూడా వచ్చిన వారిలో ఉన్నాడు. ఆర్సీబీ టీమ్ ను డిన్నర్ కు ఆహ్వానించినట్టు సిరాజ్ లోగడే ప్రకటించాడు. వచ్చిన బృందంలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం ఉన్నారు.