Esha Rebba: కుర్రాళ్లకి కుదురులేకుండా చేస్తున్న ఈషా రెబ్బా .. లేటెస్ట్ పిక్స్!

  • తెలుగు హీరోయిన్ గా మెప్పించిన అంజలి 
  • తమిళ .. మలయాళ భాషల్లో క్రేజ్ తెచ్చుకున్న స్వాతి
  • అదే బాటలో నడుస్తున్న ఈషా రెబ్బా 
  • భారీ సక్సెస్ లు లేకపోయినా తగ్గని ఫాలోయింగ్ 
Esha Rebba Special

వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలన్నా .. ఇక్కడ నిలదొక్కుకోవాలన్నా గ్లామర్ చాలా అవసరం. అందం తరువాత స్థానంలోనే అభినయం .. అదృష్టం కనిపిస్తాయి. తెరపై గ్లామరస్ గా కనిపించాలంటే కొన్ని మొహమాటాలు పక్కన పెట్టవలసిందే. ఈ విషయంలోనే తెలుగు హీరోయిన్స్ ఒక అడుగు వెనకే కనిపిస్తుంటారు. ఇతర భాషలకి చెందిన హీరోయిన్స్ గ్లామర్ పరంగా కాస్త డోస్ పెంచడానికి అంతగా అభ్యంతరపెట్టరు. అయినా అంజలి .. స్వాతి రెడ్డి వంటి హీరోయిన్స్ అంతకంటే ఒక నాలుగు అడుగులు ముందుకు వేశారు. కెరియర్ పరంగా ఇక్కడ ఎక్కువ కాలమే నిలబడ్డారు. తమిళ .. మలయాళ భాషల్లోను మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత ఇండస్ట్రీకి వచ్చిన తెలుగు అమ్మాయిగా ఈషా రెబ్బా కనిపిస్తుంది. 2012లోనే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తూ ముందుకు వెళుతోంది. ఎలా చూసుకున్నా ఈ పదేళ్లలో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. మధ్యలో కొన్ని పెద్ద సినిమాలు పడినప్పటికీ ఈ సుందరి అక్కడి నుంచి స్పీడ్ పెంచలేకపోయింది. ఇక్కడ గ్లామర్ ఒక్కటే ఉంటే చాలదు .. కాస్త లౌక్యం కూడా ఉండాలనే విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో మాత్రం ఆమె యాక్టివ్ గానే ఉంటోంది. తన లేటెస్ట్ పిక్స్ ను ఫ్యాన్స్ గుండె గోడలపై అంటించేస్తూనే ఉంది. అలా వదిలిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇక ఈషా తమిళ .. మలయాళ సినిమాలపై .. వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టేసి, ఆ దిశగా ముందుకు వెళుతుండటం విశేషం. 

More Telugu News