CGHS: ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు కేంద్రం హెచ్చరిక

  • రోగులకు జనరిక్ మందులనే సూచించాలని కేంద్ర ప్రభుత్వ వైద్యులకు ఆదేశాలు
  • బ్రాండెడ్ ఔషధాలు రాయవద్దని స్పష్టీకరణ
  • నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక
  • వైద్య సేవల డైరెక్టర్ జనరల్ ఆదేశాల జారీ
Center orders government doctors to prescribe generic medicines only

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రులు, సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ కేంద్రాల్లోని వైద్యులకు కేంద్రం తాజాగా ఓ హెచ్చరిక చేసింది. ప్రభుత్వ వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు తక్కువ ధరకు లభించే జనరిక్ మందులనే సూచించాలని స్పష్టం చేసింది. ఈ రూల్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆసుపత్రుల్లో మెడికల్ రిప్రజెంటేటివ్‌ల రాకపోకలపై కూడా పరిమితి ఉండాలని వైద్యులకు సూచించింది. 

ఈ మేరకు వైద్య సేవల డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. వైద్యులు తమ రోగులకు బ్రాండెడ్ ఔషధాలు రాస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు.

More Telugu News