Krithi Shetty: కృతి శెట్టికి కాబోయే భర్త ఇలా ఉండాలట!

Krithi Shetty interview
  • తన భర్త సింపుల్ గా, నిజాయతీగా ఉండాలన్న కృతి
  • తన తల్లి ఫ్యాషన్ డిజైనర్ అని వెల్లడి
  • షూటింగ్ లేకపోతే ముంబైలో వాలిపోతామన్న ఉప్పెన బ్యూటీ
'ఉప్పెన' సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి... తన తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అక్కినేని నాగచైతన్యతో కలసి నటించిన 'కస్టడీ' చిత్రం ఇటీవలే విడుదలైంది. మరోవైపు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు విషయాలను పంచుకుంది. హీరోలలో తనకు రామ్ చరణ్, శివకార్తికేయన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. బాలీవుడ్ నటి అలియా భట్ అంటే తనకు స్ఫూర్తి అని తెలిపింది. 

ఆరో తరగతి చదువుతున్నప్పుడే తనకు యాడ్స్ లో నటించే అవకాశం వచ్చిందని కృతి చెప్పింది. చదువుకుంటూనే యాడ్స్ చేసేదాన్నని తెలిపింది. తన తల్లి ఫ్యాషన్ డిజైనర్ అని... షూటింగ్స్ కు తనతో పాటు వస్తుంటుందని చెప్పింది. షూటింగ్ లేకపోతే ఇద్దరం ముంబైకి వెళ్లిపోతామని తెలిపింది. తనకు కాబోయే భర్త నిజాయతీగా, సింపుల్ గా ఉండాలని చెప్పింది. కొంత బొద్దుగా కూడా ఉండాలని తెలిపింది.
Krithi Shetty
Tollywood
Bollywood
Husband

More Telugu News