Nara Lokesh: లోకేశ్ మరెంతో దూరం ప్రయాణించవలసి ఉంది!: చంద్రబాబు

Chandrababu wishes to nara lokesh on completing 100 Days of Yuvagalam
  • 100 రోజులు పూర్తి చేసుకున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
  • శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు నాయుడు
  • ప్రజా సమస్యలు తెలుసుకొని, పరిష్కారం కనుగొనేందుకు ఉపయోగపడుతుందని వ్యాఖ్య
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ కు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. లోకేశ్ తండ్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తనయుడికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

తన యువగళం పాదయాత్రను దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకున్న లోకేశ్ కు శుభాకాంక్షలు అని ట్వీట్ లో పేర్కొన్నారు. తన ఈ పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకొని, వాటికి పరిష్కార మార్గం కనుగొనడానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇంకా ఎన్నో మైళ్లు ప్రయాణించవలసి ఉందన్నారు.
Nara Lokesh
Chandrababu

More Telugu News