DK Shivakumar: ఢిల్లీకి బయల్దేరిన సిద్ధరామయ్య.. డీకే శివకుమార్ విషయంలో ఉత్కంఠ

Siddaramaiah left to Delhi and DK Shivakumar still in Bengaluru
  • సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్
  • ఇద్దరినీ ఢిల్లీకి రమ్మన్న పార్టీ హైకమాండ్
  • ఇంకా బెంగళూరులోనే ఉన్న డీకే
కర్ణాటక సీఎం ఎవరనే విషయంలో నెలకొన్న సందిగ్ధత ఉత్కంఠను పెంచుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవిని ఆశిస్తుండటంతో ఎవరిని సీఎం చేయాలనే విషయంలో పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరినీ ఢిల్లీకి రావాలని అధిష్ఠానం ఆదేశించింది. కాసేపటి క్రితమే సిద్ధరామయ్య ఢిల్లీకి పయనమయ్యారు. అయితే, డీకే శివకుమార్ మాత్రం ఇంకా బెంగళూరులోనే ఉన్నారు. 

ఈరోజు తన పుట్టినరోజు కావడంతో తనను కలిసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి చాలా మంది వస్తున్నారని డీకే తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా తాను పూజలు చేయాలని, కొన్ని ఆలయాలు సందర్శించాలని అన్నారు. ఢిల్లీకి వెళ్లాలా? వద్దా? అనే విషయంలో తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సీఎం ఎవరనే విషయాన్ని తాను హైకమాండ్ కే వదిలేశానని అన్నారు. ఈ నేపథ్యంలో, డీకే ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ నెలకొంది.
DK Shivakumar
Siddaramaiah
Congress
Delhi

More Telugu News