CPI Narayana: కర్ణాటక తీర్పుతోనైనా ఏపీ పార్టీల్లో మార్పు రావాలి: సీపీఐ నారాయణ

cpi narayana says fight between congress and brs in telangana in next elections
  • ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పక్షాలన్నీ మోదీకి అనుకూలంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాయన్న నారాయణ
  • బీజేపీని ఓడించేందుకు ఏ సెక్యులర్‌ పార్టీతోనైనా జతకట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్య
  • తెలంగాణలో పొత్తులపై ఈ నెల 18, 19 తేదీల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
కర్ణాటక ఫలితాలతో దక్షిణాదిలో బీజేపీకి గేట్లు మూసుకుపోయాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పక్షాలు ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కర్ణాటక తీర్పుతోనైనా ఆయా పార్టీల్లో మార్పు రావాలని సూచించారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుందని నారాయణ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయమై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏ సెక్యులర్‌ పార్టీతోనైనా జతకట్టడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. 

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో రాజకీయ పరిణామాలు మారాయని పేర్కొన్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ, అమిత్‌ షా నాయకత్వం వహించినా బీజేపీ ఓడిపోయిందని చెప్పారు. కన్నడనాట 212 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులు మద్దతిచ్చారని తెలిపారు.
CPI Narayana
Andhra Pradesh
Narendra Modi
BRS
BJP
Congress
Karnataka
Karnataka Assembly Elections

More Telugu News