పుష్ప 2 గెటప్‌లో గంగమ్మకు వైసీపీ ఎంపీ మొక్కులు.. వీడియో!
- తిరుపతిలో వైభవంగా కొనసాగుతున్నగంగమ్మ జాతర
- మాతంగి వేషాలతో మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
- ఎమ్మెల్యే భూమన ఆధ్వర్యంలో భక్తి చైతన్య యాత్ర
అనంత వీధిలోని పూర్వపు తిరుమల ముఖద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గంగమ్మ సారెతో ఈ యాత్ర ప్రారంభమైంది. పరసాల వీధి, రామచంద్ర పుష్కరిణి, బండ్ల వీధి మీదుగా గంగమ్మ గుడికి చేరుకుంది. ఈ యాత్రలో ఎంపీ గురుమూర్తి మాతంగి వేషంలో గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. కళాకారుల మధ్యలో నిలబడి అభిమానులతో సెల్ఫీలు దిగారు. ఆపై గంగమ్మ ఆలయం వరకూ డప్పు, మంగళ వాయిద్యాల మధ్య ఎంపీ గురుమూర్తి నడుచుకుంటూ వెళ్ళి అమ్మ వారిని దర్శించుకున్నారు. మాతంగి వేషంలో ఉన్న ఎంపీ గురుమూర్తి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీడియో లింక్..