Swavthi Reddy: ఆ సినిమా తరువాత మరదలు పాత్రల కోసమే అడిగారు: స్వాతిరెడ్డి

Swathi Reddy Interview
  • తన కెరియర్ సాఫీగా సాగలేదన్న స్వాతిరెడ్డి 
  • అవసరమైన సమయాల్లో హిట్లు పడ్డాయని వెల్లడి
  • 'డేంజర్' సినిమా అప్పుడు రూమర్స్ వచ్చాయని వ్యాఖ్య  
  • పుకార్లను ఎప్పుడూ పట్టించుకోలేదని వివరణ 
బుల్లితెర నుంచి వెండితెరకి పరిచయమైనవారిలో స్వాతి రెడ్డి ఒకరు. బుల్లితెరపై 'కలర్స్' స్వాతిగా క్రేజ్ తెచ్చుకున్న తను, ఆ తరువాత హీరోయిన్ గా తన ప్రత్యేకతను చాటుకుంది. నటనలో స్వాతికి మంచి ఈజ్ ఉంది. ఎలాంటి పాత్రను ఇచ్చినా అవలీలగా చేసేస్తూ ఉంటుంది. తెలుగుతో పాటు, తమిళ .. మలయాళ భాషల్లో ఆమెకి గల అభిమానుల సంఖ్య ఎక్కువే. 

ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. నా కెరియర్ లో నేను చాలా ఒడిదుడుకులు చూశాను. ఎప్పటికప్పుడు ఈ సినిమా తరువాత మనకి మరో సినిమా రాదని అనుకునేదానిని. 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' సినిమాలో వెంకటేశ్ కి మరదలు రోల్ చేసిన తరువాత, అన్నీ మరదలు పాత్రలే వచ్చాయి. కానీ చేయడానికి నేను ఇష్టపడలేదు" అని అంది. 

నా గ్రాఫ్ పడిపోతుందని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక హిట్ పడేది. అలా ఈ రోజున నేను చెప్పుకోవడానికి కొన్ని హిట్లు ఉన్నాయి. 'స్వామి రారా' .. 'సుబ్రమణ్యపురం' .. 'కార్తికేయ' అలాంటివే. నా కెరియర్ లో 'డేంజర్' సినిమా సమయంలో పుకార్లు వచ్చాయి. కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు" అంటూ చెప్పుకొచ్చింది. 
Swavthi Reddy
Actress
Tollywood

More Telugu News