Enforcement Directorate: మాజీ మంత్రి సత్యేందర్ జైన్ సెల్‌కు మరో ఇద్దరు ఖైదీల తరలింపు.. జైలు సూపరింటెండెంట్‌కు నోటీసులు

2 inmates moved to Satyendars cell as he says hes lonely Tihar SP gets notice
  • తన సెల్‌లో ఒంటరిగా ఉంటున్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్
  • డిప్రెషన్ బాధిస్తోందని జైలు అధికారులకు వెల్లడి
  • మరో ఇద్దరు ఖైదీలను తన సెల్‌కు తరలించాలని కోరిన మాజీ మంత్రి
  • ఆయన అభ్యర్థనను మన్నించిన జైలు సూపరింటెండెంట్‌కు షో కాజ్ నోటీసులు
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ సెల్‌కు మరో ఇద్దరు ఖైదీలను తరలించిన ఘటనలో తీహార్ జైలు నెం.7 సూపరింటెండెంట్‌కు తాజాగా షో కాజ్ నోటీసులు జారీ అయ్యాయి. సెల్‌లో ఒంటరిగా ఉంటున్న తనను డిప్రెషన్ వేధిస్తోందని సత్యేందర్ జైన్ జైలు అధికారులతో పేర్కొన్నారు. కనీసం ఇద్దరు ఖైదీలను తన గదికి ట్రాన్స్‌ఫర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 

దీంతో, జైలు సూపరింటెండెంట్ ఇద్దరు ఖైదీలను మాజీ మంత్రి సెల్‌కు తరలించారు. ఈ క్రమంలోనే జైలు అధికారికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. అంతకుమునుపే, ఇద్దరు ఖైదీలను వెనక్కు పిలిపించినట్టు మరో పోలీసు అధికారి వెల్లడించారు. నగదు అక్రమ రవాణా కేసులో విచారణ ఎదుర్కొంటున్న సత్యేందర్ జైన్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
Enforcement Directorate
New Delhi

More Telugu News