Atchannaidu: ఏపీలోనూ కర్ణాటక సీన్.. టీడీపీ విజయం తప్పదు: అచ్చెన్నాయుడు

Atchannaidu believes Karnataka scene repeats in Andhra Pradesh
  • కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతే కారణమన్న అచ్చెన్న
  • ఏపీలోని అన్ని వర్గాల ప్రజల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న టీడీపీ ఏపీ చీఫ్
  • టీడీపీ శ్రేణులను కేసులతో వేధించడం తప్ప ఈ ప్రభుత్వం మరేం చేయట్లేదని ఎద్దేవా
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోనూ కర్ణాటక సీన్ రిపీట్ అవుతుందని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. కర్ణాటకలోని గత బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్ విజయానికి కారణమైందని, అలాగే రాష్ట్రంలోనూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ విజయం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. టెక్కలి టీడీపీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని అన్నారు. టీడీపీ శ్రేణులను కేసులతో వేధించడం తప్ప రాష్ట్రాభివృద్ధిపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టిపెట్టలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. జగన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టే వరకు విశ్రమించొద్దని కార్యకర్తలకు సూచించారు.
Atchannaidu
Andhra Pradesh
TDP

More Telugu News