Nara Lokesh: ఇవాళ మదర్స్ డే... లోకే​శ్​ ​ను ​​సర్ ప్రైజ్ ​చేసిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari surprises her son Lokesh at camp site
  • నేడు యువగళం పాదయాత్రకు 99వ రోజు
  • పాదయాత్ర ముగించుకుని బోయరేవుల క్యాంప్ సైట్ చేరుకున్న లోకేశ్
  • అప్పటికే అక్కడ తనయుడికి కోసం ఎదురుచూస్తున్న భువనేశ్వరి
  • తల్లిని చూసి ఆనందం పట్టలేకపోయిన లోకేశ్
అమ్మలేనిదే జననం లేదు... అమ్మలేనిదే గమనం లేదు... అమ్మలేకపోతే చరాచర సృష్టిలో జీవం లేదు... అమ్మలేకపోతే అసలు సృష్టేలేదు. ఈరోజు మాతృ దినోత్సవం. ఇక, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్కడ ఉన్నా ప్రతి ఏటా మదర్స్ డే రోజున తనకు అత్యంత ఇష్టమైన అమ్మను కలిసి ఆమెతో ఆనందాన్ని పంచుకుంటుంటారు. 

ఈ ఏడాది జనవరి 27న లోకేశ్ చారిత్రాత్మక పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈసారి మాతృ దినోత్సవం రోజున అమ్మను కలవడం కుదరకపోవడంతో ఉదయాన్నే సోషల్ మీడియా ద్వారా తన తల్లి భువనేశ్వరికి విషెస్ తెలిపారు. ఆమెకు కృతజ్జతలు చెప్పుకున్నారు. 

అయితే ఊహించని రీతిలో మదర్స్ డే రోజు లోకేశ్ ను తల్లి భువనేశ్వరి సర్ ప్రైజ్ చేశారు. లోకేశ్ ఇవాళ 99వ రోజు పాదయాత్ర ముగించుకొని ఆదివారం సాయంత్రం శ్రీశైలం నియోజకవర్గం బోయరేవుల క్యాంప్ సైట్ కి చేరగానే తల్లి నారా భువనేశ్వరి కన్పించింది. తల్లిని చూడగానే లోకేశ్ ఆనందానికే అవధుల్లేకుండా పోయాయి. 

రేపు సోమవారం యువగళం పాదయాత్రకు 100వ రోజు కాగా, పాదయాత్రలో లోకేశ్ తో పాటు ఆయన తల్లి భువనేశ్వరి నందమూరి, నారా కుటుంబ సభ్యులు, లోకేశ్ చిన్ననాటి స్నేహితులు కలిసి నడవబోతున్నారు.

 యువగళం 100వ రోజు పాదయాత్రను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు యువగళం టీమ్ కోఆర్డినేటర్ కిలారు రాజేష్ నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. తన భర్త చంద్రబాబునాయుడు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు రాజకీయ వేదికపైకి రాని నారాభువనేశ్వరి తొలిసారి బిడ్డతో కలిసి సోమవారం అడుగులు వేయనున్నారు. నారా, నందమూరి కుటుంబాలు ప్రత్యేక వాహనంలో ఇప్పటికే కర్నూలుకు చేరుకోవడంతో యువగళం బృందాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
Nara Lokesh
Nara Bhuvaneswari
Mother's Day
Yuva Galam Padayatra
TDP
Andhra Pradesh

More Telugu News