upasana: సమాజం కోసమో.. వారసత్వాన్ని కొనసాగించడానికో బిడ్డను కనడం లేదు.. మాతృదినోత్సవం సందర్భంగా ఉపాసన ఆసక్తికర పోస్ట్

ram charan wife upasana konidela baby bump pics goes viral
  • తాను తొలి మదర్స్ డే జరుపుకుంటున్నానన్న ఉపాసన
  • బేబీ బంప్ తో ఉన్న ఫొటో ట్విట్టర్, ఇన్ స్టాలో షేర్
  • మాతృత్వాన్ని స్వీకరించడానికి ఎంతో గర్వపడుతున్నానని వ్యాఖ్య
ఈ రోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలో అమ్మతనాన్ని ఆస్వాదించబోతున్న రామ్ చరణ్ సతీమణి ఉపాసన బేబీ బంప్ తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను తొలి మదర్స్ డేను జరుపుకుంటున్నాంటూ సంతోషం వ్యక్తం చేశారు. 

‘‘మాతృత్వాన్ని స్వీకరించడానికి ఎంతో గర్వపడుతున్నా. నేను సమాజం అంచనాలకు అనుగుణంగా ఉండటానికో.. వారసత్వాన్ని కొనసాగించడానికో.. మా వివాహ బంధాన్ని బలోపేతం చేసుకోవాలనో నేను అమ్మను కావాలని అనుకోలేదు. అంతులేని ప్రేమను నా బిడ్డకు ఇవ్వగలనని, జాగ్రత్తగా చూసుకోగలనని నేను మానసికంగా ప్రిపేర్ అయిన తర్వాతనే తల్లిని కావాలని నిర్ణయం తీసుకున్నా’’ అని ఇన్ స్టా గ్రామ్ లో రాసుకొచ్చారు. 

ఉపాసన పెట్టిన పోస్టుకు హీరోయిన్లు కామెంట్లు చేస్తున్నారు. కియారా అద్వానీ, సమంత, త్రిష, శ్రియ, సంయుక్త మీనన్ తదితరులు విష్ చేశారు. ‘హ్యాపీ మదర్స్ డే లవ్లీ మమ్మీ’ అంటూ కాజల్ అగర్వాల్ కామెంట్ చేసింది.
upasana
ram charan
mothers day 2023
baby bump
Instagram

More Telugu News