ఒకరినొకరు కాపాడే ప్రయత్నంలో నీటమునిగి ఐదుగురు టీనేజర్ల దుర్మరణం
- గుజరాత్‌లోని బోతాద్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
- తొలుత కృష్ణసాగర్ లేక్‌లోకి దిగి ప్రమాదంలో పడ్డ ఇద్దరు టీనేజర్లు
- వారిని కాపాడేందుకు నీళ్లలోకి దిగిన మరో ముగ్గురు
- దురృష్టవశాత్తూ ఐదుగురూ మృతి
శనివారం మధ్యాహ్నం తొలుత ఇద్దరు బాలురు నదిలోకి దిగి మునిగిపోవడం ప్రారంభించారు. అక్కడ ఉన్న మరో ముగ్గురు తమ స్నేహితులను రక్షించేందుకు ప్రయత్నించారు. దురదృష్ణవశాత్తూ వారు కూడా మరణించారని బోతాద్ ఎస్పీ కిషోర్ బలోలియా పేర్కొన్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.