Nara Lokesh: ప్రపంచంలో ఇంతకంటే వింత ఉంటుందా?: లోకేశ్

  • శ్రీశైలం నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • ఆత్మకూరు సభలో లోకేశ్ వాడీవేడి ప్రసంగం
  • సీఎం జగన్, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిలపై ధ్వజం
  • రోజుకో రంగు మార్చే ఊసరవెల్లి జగన్ అంటూ వ్యాఖ్యలు
  • చీటింగ్ చక్రపాణి అంటూ ఎమ్మెల్యే పై విమర్శలు
Lokesh yuvagalam padayatra in Srisailam constituency

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 98వ రోజు శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగింది. కరివేమ కె. స్టార్ గోడౌన్ల వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభమైంది మొదలు చెంచుకాలనీ విడిది కేంద్రానికి చేరుకునే వరకు దారిపొడవునా యువనేతకు మహిళలు, యువకులు, వృద్ధులు నీరాజనాలు పలికారు. కరివేను కె. స్టార్ గోడౌన్స్ నుంచి ఆత్మకూరు వరకు 3కి.మీ.మేరకు రోడ్లన్నీ జనమయమయ్యాయి. 

ఆత్మకూరు శివార్లలో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు. ఈ సభలో లోకేశ్ ప్రసంగం ఆద్యంతం వాడీవేడిగా సాగింది. సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఊసరవెల్లి జగన్ పేదవాడా?

రోజుకో రంగు మార్చే ఊసరవెల్లి జగన్. అందుకే పేరు మార్చి ఊసరవెల్లి జగన్ అని పెట్టా. ఊసరవెల్లి జగన్ ఈ మధ్య రెండు విషయాలు పదేపదే మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వింటే ఊసరవెల్లి కూడా షాక్ కి గురవుతుంది. ఆ రెండు అంశాలపై నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. 

మొదటిది... ఊసరవెల్లి జగన్ పేదవాడు అంట. ప్రపంచంలో 8వ వింత ఇదే. లక్ష కోట్ల ఆస్తి ఉంది, లక్ష రూపాయల చెప్పులు వాడతాడు, వెయ్యి రూపాయల నీళ్ల బాటిల్ తాగుతాడు. 2024 ఎన్నికల్లో కోటీశ్వరుడు జగన్ కి, కూటికి లేని పేదలకు మధ్య యుద్ధం జరుగుతుంది. 

రెండోది... సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు అంటూ ఊసరవెల్లి జగన్ అసత్య ప్రచారం మొదలు పెట్టాడు. కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ టీడీపీ. ఊసరవెల్లి జగన్ నిక్కర్ వేసుకునే టైంలోనే దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు. 

రెండు రూపాయిలకే కిలో బియ్యం, రైతులకు 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, 65 ఏళ్లు దాటిన వారికి 30 రూపాయల పెన్షన్, జనతా వస్త్రాల పేరుతో తక్కువ ధరకే బట్టలు అందించడం, పక్కా ఇళ్ళ నిర్మాణం ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించింది టీడీపీనే. రూ.200 పెన్షన్ ని రూ.2 వేలు చేసింది, అన్న క్యాంటిన్, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, పండుగ కానుకలు ఇచ్చింది చంద్రబాబు గారు. 

కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయలు దొబ్బేది ఊసరవెల్లి జగన్. పేదరికం, సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు ఊసరవెల్లి జగన్ కి లేదు. ఊసరవెల్లి జగన్ హయాం కంటే చంద్రబాబు గారి హయాంలోనే ఎక్కువ సంక్షేమం,అభివృద్ధి జరిగింది. దీనిపై  చర్చకు నేను రెడీ ఊసరవెల్లి జగన్ నువ్వు రెడీనా?

ఎర్రిపప్ప జగన్... ధాన్యం ఎప్పుడు కొంటావ్?

తడిచిన ధాన్యం కొనమని ఒక రైతు అడిగితే మంత్రి కారుమూరు ఎర్రిపప్ప అని తిట్టడమేగాక ఎర్రిపప్పకు కొత్త అర్ధం చెప్పాడు. ఎర్రిపప్ప అంటే బుజ్జినాన్న అని అర్ధం అంట. మంత్రి డిక్షనరీ ప్రకారం వైసీపీది ఎర్రిపప్ప ప్రభుత్వం. జగన్ ఒక ఎర్రిపప్ప సీఎం. 

నేను మంత్రి డిక్షనరీ ప్రకారం అడుగుతున్నా. ఎర్రిపప్ప జగన్... ధాన్యం ఎప్పటిలోగా కొంటారు? రైతులంటే మీకు అంత చులకనా? మంత్రి కారుమూరు, జగన్ రాష్ట్ర రైతులకు క్షమాపణ చెప్పే వరకూ మీ ప్రభుత్వాన్ని ఎర్రిపప్ప ప్రభుత్వం అని, ఎర్రిపప్ప జగన్ అని పిలుస్తూనే ఉంటాం. 

చీటింగ్ చక్రపాణికి డబ్బుపిచ్చి!

2019 ఎన్నికల్లో మీరు భారీ మెజారిటీతో శిల్పా చక్రపాణి రెడ్డి గారిని గెలిపించారు. శ్రీశైలం ఏమైనా అభివృద్ధి చెందిందా? ఎవరి జీవితాలు అయినా మారాయా? ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు, బంధువులు, అనుచరులు కలిసి భూకబ్జాలకు పాల్పడుతున్నారు, ఇసుక, ఎర్రమట్టి అక్రమంగా తరలిస్తున్నారు. అందుకే పేరు మార్చాను... ఆయన శిల్పా చక్రపాణి కాదు, చీటింగ్ చక్రపాణి. 

రూ.5 లక్షల పనికి కూడా 10 శాతం తీసుకుంటున్నాడు అంటే చీటింగ్ చక్రపాణికి ఎంత డబ్బు పిచ్చి ఉందో అర్ధం చేసుకోండి. చీటింగ్ చక్రపాణి అని ఎందుకు అంటున్నానో చెబుతా. ఎమ్మెల్యే గా గెలిచిన వెంటనే చీటింగ్ చక్రపాణి గారు వర్ధన్ బ్యాంక్ ప్రారంభించారు. ఆ రోజు ఆయన ఏమన్నారో గుర్తుందా? వర్ధన్ బ్యాంక్ అంటే శిల్పా బ్యాంక్ అన్నారు. ఆ బ్యాంక్ రూ.100 కోట్లు సేకరించి దుకాణం సర్దేసింది. బ్యాంకు పెట్టిన బినామీని పార్టీ నుండి సస్పెండ్ చేయించి డబ్బు మొత్తం కొట్టేశాడు చీటింగ్ చక్రపాణి. 

50 శాతం సబ్సిడీతో రుణాలు ఇస్తాం అని దళితుల్ని మోసం చేశాడు ఈ చీటింగ్ చక్రపాణి. దేవుడ్ని కూడా వదలలేదు. శ్రీశైలం దేవస్థానాన్ని ఏటీఎంలా మార్చుకున్నారు. శ్రీశైలం దేవస్థానంలో తన ఏజెన్సీ ద్వారా కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల్లో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డుల నియామక టెండర్లు బంధువు రాజశేఖరరెడ్డికి కట్టబెట్టారు. 

అడగడుగునా భూముల కబ్జా!

కృష్ణాపురం గ్రామంలోని లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి చెందిన 40 ఎకరాల భూమిని చీటింగ్ చక్రపాణి అనుచరుడు పుల్లారెడ్డి కబ్జా చేసి అమ్మేసుకున్నాడు. శ్రీశైలంలో ఎవరు రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్యాలి అన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అన్నా చీటింగ్ చక్రపాణి తమ్ముడు శిల్పా భువనేశ్వర రెడ్డికి 10 శాతం కప్పం కట్టాల్సిందే. 

శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో చీటింగ్ చక్రపాణి అనుచరులు వడ్డి వెంకటరెడ్డి, గుండయ్య ఇరిగేషన్ భూములు పది ఎకరాలకు పైగా కబ్జా చేశారు. లాడ్జ్ లు కూడా కట్టేసారు. సున్నిపెంటలో డ్రైవర్ అసోషియేషన్ భూములు ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మేసారు చీటింగ్ చక్రపాణి అనుచరులు. ఆత్మకూరులో చీటింగ్ చక్రపాణి అనుచరుడు అంజాద్ అలీ రూ.10 కోట్లు విలువ చేసే అసైన్డ్ భూములను కబ్జా చేశాడు. సర్వే నంబర్ 825/ఏ1 లో ఉస్సేన్ సాహెబ్ కి చెందిన భూమిని అంజాద్ అలీ కబ్జా చేసాడు. బాధితుడు ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. 

యువగళం వివరాలు...

ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1252.7కి.మీ.

ఈరోజు నడిచింది దూరం 13.2 కి.మీ.

99వ రోజు (14.05.2023) పాదయాత్ర వివరాలు

శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం(నంద్యాల జిల్లా)

ఉదయం

7.00 - చెంచుకాలనీ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

7.10 – వెలగాము వద్ద కొత్తరామాపురం గ్రామస్తులతో సమావేశం.

9.45 – తెలుగుగంగ ప్రాజెక్టు సందర్శన.

11.15 – ఫారెస్టు కార్యాలయం సమీపాన స్కిల్డ్ & అన్ స్కిల్డ్ వర్కర్లతో ముఖాముఖి.

మధ్యాహ్నం

12.15 – ఫారెస్టు కార్యాలయం సమీపాన భోజన విరామం.

సాయంత్రం

4.00 – ఫారెస్టు కార్యాలయం వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.45 – వెలిగోడు గండిపేట వద్ద బెస్త సామాజికవర్గీయులతో సమావేశం.

4.55 – వెలిగోడు మదీన మసీదు వద్ద స్థానికులతో మాటామంతీ.

5.15 – వెలిగోడు సిపి నగర్ మెయిన్ రోడ్డులో బుడగ జంగాలతో సమావేశం.

5:35 - వెలిగొడు చర్చి వద్ద ఎస్సీ సామాజిక వర్గీయులతో సమావేశం.

6.25– బోయరేవులలో స్థానికులతో మాటామంతీ.

6.45 – బోయరేవుల శివారు విడిది కేంద్రంలో బస.

More Telugu News