Haryana: భారీ కార్పొరేట్ ఆఫీసుల్లో ఉద్యోగులకు మద్యం!

  • హరియాణాలో కొత్త మద్యం పాలసీ
  • కనీసం 5 వేల మంది ఉద్యోగులున్న కార్పొరేట్ కార్యాలయాల్లో ఉద్యోగులకు బీర్, వైన్‌ సరఫరాకు అనుమతి
  • కార్యాలయం విస్తీర్ణం లక్ష చదరపు అడుగులు ఉండాలని మరో నిబంధన
  • ఆల్కహాల్ శాతం తక్కువగా వుండే వైన్, బీర్ సరఫరా చేయాలని నియమం 
  • ఏటా రూ. 10 లక్షలు లైసెన్స్ ఫీజు
Large offices in Haryana can now serve beer wine to employees

భారీ కార్పొరేట్ ఆఫీసుల్లో ఉద్యోగులు తక్కువ స్థాయిలో ఆల్కహాల్ కంటెంట్ ఉన్న బీర్, వైన్ తాగొచ్చని హరియాణా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు హరియాణా మంత్రి మండలి ఇటీవల కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కార్పొరేట్ ఆఫీసులు ముందుగా ఎల్-10 పేరిట లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. కనీసం 5 వేల మంది ఉద్యోగులతో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలోని కార్యాలయాల్లో మాత్రమే ఉద్యోగులకు మద్యం సరఫరా చేయచ్చు. ఎక్సైస్ టాక్సేషన్ కమిషనర్ అనుమతి అనంతరం కలెక్టర్ ఈ లైసెన్స్ జారీ చేస్తారు. ఈ లైసెన్స్ కోసం ఏటా రూ.10 లక్షలు చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది.

More Telugu News