Narendra Modi: కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ అభినందనలు

PM Moi wishes Congress party for winning Karnataka elections
  • ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్
  • బీజేపీకి అండగా నిలబడిన వారికి థ్యాంక్స్ చెప్పిన ప్రధాని
  • మున్ముందు మరింత శక్తితో కర్ణాటకకు సేవ చేస్తామని మరో ట్వీట్
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. 'కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి నా శుభాకాంక్షలు.' అని ట్వీట్ చేశారు. అలాగే బీజేపీకి మద్దతుగా నిలిచి వారికి కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు.

కర్ణాటక ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు అని, బీజేపీ కార్యకర్తల కృషిని అభినందిస్తున్నానని, రాబోయే కాలంలో మరింత శక్తితో కర్ణాటకకు సేవ చేస్తామని మరో ట్వీట్ లో పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 136, బీజేపీ 65, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.
Narendra Modi
Congress
BJP
Karnataka

More Telugu News