: కాంగ్రెస్ పోవాలి, బీజేపీ రావాలి: వెంకయ్యనాయుడు
ప్రాంతీయ పార్టీలకు ఓట్లేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో అవినీతి పెరిగిపోయిందని, ఇచ్చిన మాటలు నేరవేర్చడం మర్చిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పోవాలి, బీజేపీ రావాలి అని వెంకయ్య నినదించారు. కాంగ్రెస్ ఎన్ని హామీలిచ్చినా నేరవేర్చలేదని, ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేసిన ఘనత ఒక్క బీజేపీకి మాత్రమేనని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు 15 సీట్లివ్వండి, 16 సీట్లివ్వండి అని అడుగుతున్నాయని, అలా ఇచ్చినా వారు తెలంగాణ తేగలరా? అని ప్రశ్నించారు. తేవాలంటే కేవలం ఎన్డీఏ కు మాత్రమే సాధ్యమని అన్నారు.