Congress: కర్ణాటకలో మ్యాజిక్ ఫిగర్ దాటి ఇంకా ముందుకెళ్లిన కాంగ్రెస్

Congres crosses magic figure in Karnataka assembly elections
  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
  • నేడు ఓట్ల లెక్కింపు
  • ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
  • మధ్యాహ్నం 3 గంటల వేళకు 131 స్థానాలతో ఉన్న కాంగ్రెస్
  • బీజేపీ ఖాతాలో 64
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం ముంగిట నిలిచింది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత రీతిలో ఫలితాలను సాధించింది. 

ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3 గంటల సమయానికి 131 స్థానాలు చేజిక్కించుకుంది. మరో 3 స్థానాల్లో అధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ (113) ఎప్పుడో దాటేసిన కాంగ్రెస్ అధికార బీజేపీపై స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. ప్రస్తుతం బీజేపీ 64 స్థానాల్లో నెగ్గి, మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జనతాదళ్ (ఎస్) 19 స్థానాల్లో గెలిచి, ఒక చోట ముందంజలో ఉంది. ఇతరులు 4 చోట్ల గెలిచారు. 

బీజేపీ తరఫున ప్రధాని మోదీ స్వయంగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. ఆ పార్టీ 70 లోపు స్థానాలకే పరిమితమైంది. తమదే విజయం అని అతి విశ్వాసంతో ఉన్న బీజేపీ నేతలకు ఈ ఫలితాలు మింగుడుపడడంలేదు.
Congress
Karnataka
Assembly Elections
Magic Figure

More Telugu News