Yediyurappa: ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. కొత్త ప్రభుత్వానికి సహకరిస్తాం: యెడ్యూరప్ప

We will respect peoples verdict says Yediyurappa
  • గెలుపు, ఓటములు బీజేపీకి కొత్త కాదన్న యెడ్యూరప్ప
  • పార్టీ శ్రేణులు భయపడొద్దన్న మాజీ సీఎం
  • రెండు స్థానాల నుంచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగామని వ్యాఖ్య
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ఓటమిని అంగీకరించారు. గెలుపు, ఓటములు బీజేపీకి కొత్త కాదని ఆయన అన్నారు. రెండు స్థానాలతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం... రాష్ట్రంలో సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్థాయి వరకు కొనసాగిందని చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలతో పార్టీ వర్కర్లు ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్నికల్లో పరాజయంపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు.
Yediyurappa
BJP
Karnataka
Elections

More Telugu News