DK Shivakumar: జైల్లో గడిపిన రోజులను గుర్తు చేసుకుని.. తీవ్ర భావోద్వేగానికి గురై ఏడ్చేసిన డీకే శివకుమార్

DK Shivakumar breaks down while speaking to media
  • కాంగ్రెస్ కు ఘన విజయాన్ని కట్టబెట్టిన అందరి పాదాలకు నమస్కారం చేస్తున్నానన్న డీకే
  • సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు కర్ణాటకలో గెలిపిస్తానని మాట ఇచ్చానని వెల్లడి
  • తనను చూసేందుకు సోనియా జైలుకు రావడాన్ని మర్చిపోలేనని వ్యాఖ్య
కర్ణాటకలో బీజేపీని మట్టికరిపించి, ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పార్టీకి ఇంతటి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజల పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నానని చెప్పారు. తమ మీద విశ్వాసం ఉంచి కాంగ్రెస్ కు గొప్ప విజయాన్ని అందించారని కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో పార్టీని గెలిపిస్తానని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు తాను మాట ఇచ్చానని చెప్పారు.

బీజేపీ తనను జైల్లో పెట్టించినప్పుడు... తనను చూడ్డానికి సోనియా గాంధీ జైలుకు రావడాన్ని తాను జీవితంలో మర్చిపోలేనని చెపుతూ తీవ్ర భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ కార్యాలయం తమకు దేవాలయంతో సమానమని... తర్వాతి స్టెప్ ఏమిటనేది తమ కార్యాలయంలో నిర్ణయిస్తామని చెప్పారు. ఈ విజయం అందరి సమష్టి కృషి అని అన్నారు. సిద్ధరామయ్యతో పాటు ప్రతి ఒక్క నేత, ప్రతి ఒక్క కార్యకర్త ఈ విజయంలో భాగస్వాములని చెప్పారు.
DK Shivakumar
Congress
Karnataka

More Telugu News