Mahindra SUV: తన ఐడియాతో ఆనంద్ మహీంద్రా స్పందించేలా చేసిన వ్యక్తి

Man Uses Mahindra SUV Cut Out As TV Stand At Home Anand Mahindra Is Flattered
  • ఇంట్లో టీవీ స్టాండ్ కోసం వినూత్న ఆలోచన
  • మహీంద్రా మేజర్ జీప్ ముందు భాగాన్ని పోలిన ఫ్రేమ్
  • దానిపై టీవీని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి
  • అభినందించిన ఆనంద్ మహీంద్రా
ఓ వ్యక్తికి వచ్చిన వినూత్నమైన ఆలోచన.. చివరికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను స్పందించేలా చేసింది. సృజనాత్మకత కలిగిన ఓ వ్యక్తి తన ఇంటి సిట్టింగ్ రూమ్ లో టీవీ ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దాన్ని తీసుకెళ్లి గోడకు పెట్టేయలేదు. అలా అని ఓ టేబుల్ వేసి దానిపై పెట్టలేదు. మహీంద్రా మేజర్ జీప్ ముందు భాగాన్ని టేబుల్ గా మార్చాడు. దానిపై తన టీవీ పెట్టేశాడు. 

ఈ ఫొటో ఏదో మార్గంలో ఆనంద్ మహీంద్రాను చేరింది. దాంతో ఆయన ఆశ్చర్యానికి లోనయ్యారు. దీన్ని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేస్తూ.. ‘‘ధన్యవాదాలు.. మాకు నచ్చింది.. నేను చూసిన అతిపెద్ద డాష్ బోర్డ్ స్క్రీన్ డిస్ ప్లే ఇదే’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. నిజానికి మహీంద్రా మేజర్ జీప్ ముందు భాగాన్ని పోలినట్టుగా అతడు తయారు చేయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇంటీరియర్ డిజైన్ కొత్తగా ఉండాలని భావించే వారు ఇలాంటి ఆవిష్కరణలతో తమ అభిరుచిని తీర్చుకుంటుంటారు.
Mahindra SUV
TV Stand
Anand Mahindra
reaction
convesion

More Telugu News