ఎంపీ మార్గాని భరత్ కుటుంబ సభ్యుల కారు ఢీకొని వృద్ధుడి మృతి.. కారులో ఎంపీ లేరన్న పోలీసులు

  • సీతంపేట సమీపంలో ఘటన
  • రోడ్డు దాటుతున్న రిటైర్డ్ పశు వైద్యుడిని ఢీకొట్టిన కారు
  • అక్కడికక్కడే మృతి
  • పోలీసుల అదుపులో కారు డ్రైవర్
రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ కుటుంబ సభ్యుల కారు ఢీకొని ఓ వృద్ధుడు మరణించాడు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేట సమీపంలోని జాతీయ రహదారిపై నిన్న ఉదయం జరిగిందీ ఘటన. మృతుడిని భీమడోలుకు చెందిన రిటైర్డ్ పశు వైద్యుడు శృంగవృక్షం నరసయ్య (65)గా గుర్తించారు. 

పోలీసుల కథనం ప్రకారం.. మార్గాని భరత్ కుటుంబ సభ్యుల కారు నల్లజర్ల వైపు నుంచి విజయవాడవైపు వెళ్తుండగా సీతంపేట సమీపంలో ప్రమాదం జరిగింది. బైక్‌పై రోడ్డు దాటుతున్న నరసయ్యను కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నరసయ్య మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కారును పోలీస్ స్టేషన్‌కు తరలించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో ఎంపీ కారులో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Margani Bharat
Andhra Pradesh
Road Accident

More Telugu News