JDS: భారీ ట్విస్ట్.. మద్దతు ఇవ్వడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న జేడీఎస్.. తన్వీర్ కు పార్టీతో సంబంధం లేదని వ్యాఖ్య

Not yet taken any decision on alliances clarifies JDS President Ibrahim
  • ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంలో జేడీఎస్ నిర్ణయం తీసుకుందన్న తన్వీర్
  • ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న ఇబ్రహీం
  • రేపు ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూస్తామని వివరణ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న తరుణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ పార్టీకి కావాల్సినంత మెజర్టీ రాకుండా హంగ్ వస్తే పరిస్థితి ఏమిటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవేళ హంగ్ వస్తే జేడీఎస్ మద్దతు కీలకమవుతుంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని ఈ ఉదయం తన్వీర్ అహ్మద్ చెప్పిన సంగతి తెలిసిందే. (తనను తాను జేడీఎస్ అధికార ప్రతినిధిగా తన్వీర్ చెప్పుకోవడం గమనార్హం.) 


ఈ క్రమంలో జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం స్పందిస్తూ... మద్దతుపై నిర్ణయం తీసుకున్నామనే వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఈ అంశంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తన్వీర్ అహ్మద్ ప్రస్తుతం జేడీఎస్ లో లేరని... ఆయన వ్యాఖ్యలకు విలువ లేదని చెప్పారు. రేపు ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు తాము వేచి చూస్తామని అన్నారు.
JDS
Karnataka
Alliance
BJP
Congress

More Telugu News