Ziva Dhoni: ఆట ముగియగానే మైదానంలోకి పరుగెత్తుకు వచ్చిన ధోనీ కూతురు

Ziva Dhoni adorably runs to MS Dhoni steals the show post CSK vs DC match
  • చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కనిపించిన దృశ్యం
  • జీవాని దగ్గరకు తీసుకున్న ధోనీ
  • ఇద్దరి మధ్య ముచ్చట్లు
  • జీవా కూడా తండ్రి మాదిరిగా క్రికెటర్ అయితే? అంటూ ఓ యూజర్ కామెంట్
ధోనీ వారసురాలు జీవా ధోనీ ఐపీఎల్ టోర్నమెంట్ల సందర్భంగా సందడి చేస్తోంది. సీఎస్కే మ్యాచ్ జరిగే ప్రతీ వేదికకు తన తల్లి సాక్షితోపాటు వచ్చి మ్యాచ్ ను వీక్షించడమే కాకుండా కేరింతలు కొడుతోంది. ఇటీవలే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగడం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ అరుదైన దృశ్యం కనిపించింది. మైదానంలో ఉన్న ధోనీ వద్దకు జీవా పరుగెత్తుకుంటూ వచ్చింది. (ఇన్ స్టా వీడియో కోసం)

కూతురిని ధోనీ దగ్గరకు తీసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ ముచ్చటించుకోవడం కనిపించింది. ఈ వీడియో క్లిప్ ను ఇన్ స్టా గ్రామ్ లో ఐపీఎల్ టీ20 అండ్ చెన్నై ఐపీఎల్ పేరుతో ఉన్న అకౌంట్ లో షేర్ చేయగా, ఇప్పటికే 30 లక్షలకు పైగా చూశారు. 20 లక్షల మందికి పైగా పైగా లైక్ కొట్టేశారు. సో స్వీట్, సో క్యూట్ అంటూ సీఎస్కే అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరొక యూజర్ అయితే భవిష్యత్తులో జీవా కూడా తండ్రి మాదిరిగా క్రికెటర్ గా మారితే ఎలా ఉంటుంది? అంటూ ఆసక్తికర ప్రశ్న సంధించడం కనిపించింది. తండ్రికి రాకుమారి అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. ఈ నెల 10న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీపై సీఎస్కే ఘన విజయం నమోదు చేయడం తెలిసిందే.
Ziva Dhoni
MS Dhoni
chennai super kings
chepauk stadium

More Telugu News