Baby: ముగ్గురి డీఎన్ఏతో జన్మించిన బేబీ

  • బ్రిటన్ లో వైద్య నిపుణుల కొత్త పరిష్కారం
  • పుట్టే శిశువుల్లో జన్యులోపాల నివారణకు ఈ విధానం
  • తల్లిదండ్రులతో పాటు మరో దాత నుంచి డీఎన్ఏ
Baby with DNA from three people born in UK

వైద్య శాస్త్రం ఎప్పటికప్పుడు పురోగతితో ముందుకు వెళుతోంది. అందుకు ఎన్నో నిదర్శనాల్లో ఇదీ ఒకటి. బ్రిటన్ లో ఓ బేబీ ముగ్గురి డీఎన్ఏతో జన్మించింది. ఇది చాలా అరుదైనది. సాధారణంగా ఒక బేబీకి తల్లి, తండ్రి డీఎన్ఏనే ఉంటాయి. కాకపోతే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) అనే సంతాన సాఫల్య ప్రక్రియలో భాగంగా మూడో డీఎన్ఏను జొప్పించి బేబీ జన్మించేలా వైద్యులు చేశారు. ఎందుకు ఇలా చేయడం అన్న ప్రశ్న రావచ్చు. దీనిద్వారా తల్లి నుంచి వచ్చే మైటోకాండ్రియల్ వ్యాధిని నివారించొచ్చు. 

ఈ బేబీలో అధిక శాతం డీఎన్ఏ తల్లిదండ్రులదే ఉంది. కాకపోతే మూడో వ్యక్తి డీఎన్ఏ కేవలం 0.1 శాతమే అని గుర్తు పెట్టుకోవాలి. మరో మహిళ దాతగా ముందుకు రాగా, ఆమె నుంచి సేకరించారు. బ్రిటన్ లోని న్యూకాస్టిల్ ఫెర్టిలిటీ కేంద్రం ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. మైటోకాండ్రియల్ వ్యాధి నివారణకు ఈ విధమైన ప్రక్రియలను అనుసరించేందుకు బ్రిటన్ పార్లమెంట్ 2015లో చట్టాల్లో మార్పులు చేయడం గమనార్హం. 

మన శరీరంలోని అన్ని కణాలకు శక్తి అందాలంటే మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయాల్సిందే. జన్యువుల్లో లోపాలతో మైటోకాండ్రియల్ తదితర వ్యాధుల రిస్క్ ఏర్పడుతుంది. కేవలం తల్లి ద్వారానే బేబీలకు ఈ సమస్య సంక్రమిస్తుంది. అందుకని తల్లి నుంచి పిల్లలకు అది బదిలీ కాకుండా నివారించేందుకే వైద్యులు మూడో వ్యక్తి డీఎన్ఏను జొప్పిస్తున్నారు. దీనివల్ల పుట్టే బిడ్డ అనారోగ్యం బారిన పడకుండా నివారించొచ్చు.

More Telugu News