viral vedio: మహిళ డ్రైవింగ్.. కారు కింద నలిగిపోయిన టూ వీలర్లు

Kanpur woman rams her car into parked scooters and bikes Video  viral
  • కాన్పూర్ పట్టణంలో చోటుచేసుకున్న ఘటన
  • రద్దీ రోడ్డులో డ్రైవింగ్ నేర్చుకుంటున్న మహిళ
  • రివర్స్ మోడ్ లో అదుపు తప్పిన కారు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ మహిళ తన కారుపై నియంత్రణ కోల్పోయింది. పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలపైకి ఆమె నడుపుతున్న కారు దూసుకుపోయింది. చూడ్డానికి ఈ దృశ్యం సినిమా సీన్ ను గుర్తు చేసింది. టూ వీలర్లపైకి ఎక్కి ఆగిపోయిన ఆ కారును అక్కడకు చేరుకున్న స్థానికులు ఆసక్తిగా గమనిస్తుండడం కనిపిస్తోంది. దీన్ని ఎవరో వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

కారు నడిపే మహిళ మద్యం మత్తులో ఉందా? అన్నది ఇంకా వెల్లడి కాలేదు. ఆమె కారును రివర్స్ మోడ్ లో పార్క్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఇలా జరిగినట్టు చెబుతున్నారు. పైగా మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే రద్దీగా ఉన్న రోడ్డులో ఆమె కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. సదరు మహిళపై ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. వేగాన్ని అదుపు చేసుకోవడంలో విఫలం కావడమే ఈ ప్రమాదానికి దారితీసినట్టు పోలీసులు తెలిపారు. కాన్పూర్ పట్టణంలోని ఫజల్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది జరిగింది.
viral vedio
kanpur
woman
rash driving
two wheelers
damaged

More Telugu News