Sudigali Sudheer: టాలీవుడ్ కి మరో దివ్యభారతి!

  • సుడిగాలి సుధీర్ హీరోగా మరో సినిమా
  • హీరోయిన్ గా దివ్యభారతి పరిచయం
  • తాజాగా షూటింగుకి హాజరైన బ్యూటీ   
  • దర్శకుడిగా 'పాగల్' ఫేమ్ నరేశ్ కుప్పిలి
Divyabharathi Special

ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి కొంతమంది కొత్త కథానాయికలు పరిచయమయ్యారు. అయితే దురదృష్టవశాత్తు కొత్త హీరోయిన్స్ చేసిన ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు. దాంతో గ్లామర్ ఉన్నప్పటికీ .. యూత్ నుంచి మంచి మార్కులు పడినప్పటికీ వారికి మరో ఛాన్స్ ఇంతవరకూ రాలేదు.

ఈ నేపథ్యంలోనే కొత్తగా మరో కథానాయిక తెలుగు తెరకి రానుంది .. ఆ బ్యూటీ పేరే 'దివ్యభారతి'. సుడిగాలి సుధీర్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఆయన జోడీగా దివ్యభారతి పరిచయమవుతోంది. మహాతేజ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నాడు.

నరేశ్ కుప్పిలి ఇంతకుముందు విష్వక్సేన్ హీరోగా 'పాగల్' సినిమాను రూపొందించాడు. ఆ సినిమా ఓ మాదిరిగా ఆడింది. ఆ తరువాత సినిమాగా ఆయన ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి టీమ్ సభ్యులు దివ్యభారతికి వెల్ కమ్ చెప్పారు. ఈ సినిమాతో ఈ సుందరి ఇక్కడ నిలదొక్కుకుంటుందేమో చూడాలి.

More Telugu News