Telangana: తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

Telangana will see scorching temparature in the next two days
  • గురువారానికి బంగాళాఖాతంలో తీవ్ర తుపాను
  • ఈ నెల 12 కల్లా అతి తీవ్ర తుపానుగా రూపాంతరం
  • అనంతరం, మధ్య బంగాళాఖాతంలో తుపాను బలహీనపడే అవకాశం
  • ఆ తరువాత తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు 
తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తాజాగా పేర్కొంది. గ్రేటర్ పరిసర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటాయని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడిన అనంతరం తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది. 

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బుధవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని చెప్పింది. గురువారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 12వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపానుగా మారొచ్చని అంచనా వేసింది. ఈ క్రమంలో తుపాను దిశను మార్చుకుని బలహీనపడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. 

ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నట్టు అంచనా వేసింది. తుపాను అనంతరం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగి 40 డిగ్రీల మార్కును చేరతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Telangana

More Telugu News