IPL 2023: సీఎస్కే, ఆర్సీబీ, ముంబై, ఢిల్లీ ప్లే ఆఫ్ కు వెళతాయా?

  • ప్లే ఆఫ్ కు చేరువలోకి వచ్చేసిన గుజరాత్ టైటాన్స్
  • రెండో స్థానంలో ఉన్న సీఎస్కేకు ఎక్కువ అవకాశాలు
  • రాజస్థాన్, లక్నో, ముంబై ఇండియన్స్ కూ మెరుగైన అవకాశాలు
  • కీలకంగా పనిచేయనున్న నెట్ రన్ రేట్
IPL 2023 playoffs equation How MI RCB CSK and DC can qualify all scenarios explained

ఐపీఎల్ 2023 లీగ్ దశ చివరికి వచ్చింది. మొత్తం 10 జట్లు ఉండగా, ప్రతీ జట్టు 14 మ్యాచులు ఆడనుంది. ఇప్పటికి దాదాపుగా ఒక్కో జట్టు 11 మ్యాచులను పూర్తి చేసుకుంది. 16 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ దాదాపుగా ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకున్నట్టుగానే చెప్పుకోవాలి. ఆ జట్టుకు ఉన్న బలం దృష్ట్యా మిగిలిన మూడింటిలో రెండు సులభంగానే గెలుస్తుంది. మరో మూడు జట్లు ప్లే ఆఫ్ చేరుకోగలవు. సీఎస్కే 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉంటే, ముంబై ఇండియన్స్ 12 పాయింట్లతో, ఎల్ఎస్ జీ 11 పాయింట్లతో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆర్సీబీ 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. దీంతో ప్లే ఆఫ్ కు వెళ్లే జట్లు ఏవన్న ఆసక్తి నెలకొంది. 

సమీకరణాల దృష్ట్యా చూస్తే ఆర్సీబీ, ఢిల్లీకి అవకాశాలు క్లిష్టమనే చెప్పుకోవాలి. గుజరాత్ టైటాన్స్, సీఎస్కే, ముంబై ఇండియన్స్, ఎల్ఎస్ జీ, రాజస్థాన్ రాయల్స్ కు ఎక్కువ అవకాశాలున్నాయి. రాజస్థాన్, లక్నో జట్లకు మెరుగైన రన్ రేట్ కలసి రానుంది. ముంబై ఇండియన్స్ మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారైనట్టే. మిగిలిన మ్యాచుల్లో గెలుపు, ఓటములు ఎలా ఉన్నా, నెట్ రన్ రేట్ ను పెంచుకోవడం అన్ని జట్లకు కీలకం కానుంది. ఒకవేళ ఆర్సీబీ మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిస్తే ప్లే ఆఫ్ కు పోటీలోకి వస్తుంది. అక్కడ నెట్ రన్ రేట్ కీలకంగా మారొచ్చు. 

సీఎస్కే సొంత మైదానంలో ఈ సీజన్ లో బలాన్ని చాటుతోంది. సీఎస్కే ఆడాల్సిన మిగిలిన మూడు మ్యాచుల్లో రెండు చెపాక్ స్టేడియంలోనే జరుగుతాయి. ఇది సీఎస్కేకి కలిసొచ్చే అంశం. మిగిలిన మూడింటిలో రెండింటిలో గెలిచినా సీఎస్కే ప్లే ఆఫ్ కు దాదాపుగా చేరుకుంటుంది. లక్నో జట్టుతో వర్షం కారణంగా మ్యాచు రద్దయ్యి వచ్చిన ఒక పాయింట్ ఇరు జట్లకు బోనస్ గా పనిచేయనుంది. ఢిల్లీ జట్టు మరో నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది. అందులో మూడింటిలో విజయం తప్పనిసరి. కానీ ఢిల్లీ జట్టు సమతూకం దృష్ట్యా ఇది కొంచెం కష్టమైన పనే అని తెలుస్తోంది.

More Telugu News