kunamneni sambasiva rao: మునుగోడు సహా ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి: సీపీఐ నేత కూనంనేని

Kunamneni faults KCR government over ORR lease
  • ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు లీజుకు ఇచ్చిందని ప్రశ్న
  • లీజు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టమని వ్యాఖ్య
  • సచివాలయానికి ప్రతిపక్షాలను రానీయకపోవడంపై ఆగ్రహం

ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు లీజుకు ఇచ్చిందని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మంగళవారం ప్రశ్నించారు. ఈ లీజు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పారు. కొత్తగా నిర్మించిన సచివాలయానికి ప్రతిపక్షాలను ఎందుకు రానివ్వడం లేదో చెప్పాలని కూనంనేని నిలదీశారు. హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, బెల్లంపల్లి, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాలపై తాము ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News