విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టు అధికారిక ప్రకటన .. హీరోయిన్ గా శ్రీలీల!

Vijay Devarakonda in Goutham Thinnanuri
  • గౌతమ్ తిన్ననూరి నుంచి స్పై థ్రిల్లర్ 
  • విజయ్ దేవరకొండ జోడీకడుతున్న శ్రీలీల
  • సంగీతాన్ని అందిస్తున్న అనిరుధ్ 
  • సితార బ్యానర్లో రూపొందుతున్న సినిమా 
విజయ్ దేవరకొండ నుంచి ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఖుషి' సినిమా రెడీ అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మరో ప్రాజెక్టును విజయ్ దేవరకొండ పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. 

ఈ రోజున విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను వదిలారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ వలన ఇది ఒక స్పై థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ అనే విషయం అర్థమవుతోంది. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో 'జెర్సీ' తరువాత ఆయన రూపొందిస్తున్న సినిమా ఇది. 

అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, సితార నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీలను తీసుకున్నారు. ఆల్రెడీ రామ్ జోడీగా .. నితిన్ జోడీగా సిసినిమాలు చేస్తున్న ఆమె, విజయ్ దేవరకొండ సరసన కూడా అవకాశాన్ని చేజిక్కించుకోవడం విశేషమే.
Go Back to Shorts
Vijay devaarakonda
Sreeleela
Goutham TThinnanuri

More Telugu News