Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Sensex Nifty end flat on fag end selling
  • ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
  • అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి సూచీలు
  • ప్రాఫిట్ బుకింగ్, ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావం
స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్నం సమయానికి గరిష్ఠానికి చేరుకున్నాయి. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి వెళ్లాయి. గరిష్ఠాల వద్ద ప్రాఫిట్ బుకింగ్, ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు ప్రభావం చూపాయి. చివరకు సెన్సెక్స్ 3 పాయింట్ల నష్టాల్లో, నిఫ్టీ 1.55 పాయింట్ల లాభాల్లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ స్టాక్స్ భారీ నష్టాల్లో ముగిశాయి.

టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంకు స్టాక్స్ లాభాల్లో ముగియగా, ఐటీసీ, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీలు ఫ్లాట్ గా, స్మాల్ క్యాప్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా వినియోగ ఆందోళనల నేపథ్యంలో చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 76 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. ఇక డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 24 పైసలు క్షీణించి 82.04 వద్ద ముగిసింది.
Stock Market
Sensex
Nifty

More Telugu News