తెలంగాణలో గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహం, విలేజ్ కమిటీల ఏర్పాటు
- గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
- ప్రతి మండలంలో కనీసం 25 మంది సభ్యులతో కాంగ్రెస్ ఎన్నికల బృందం ఏర్పాటు
- కమిటీలో 40 శాతం మంది మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు
ఈ నెలాఖరులోగా రూరల్ ఎన్నికల టీమ్‌లు అన్నీ అందుబాటులోకి రానున్నాయి. ముందస్తు ప్రచార శిక్షణ తరగతుల అనంతరం ఆ బృందం గ్రామాల్లో ప్రచారం చేస్తారు. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజవకర్గంలో 5 మండలాలు ఉన్నాయి. మొత్తం 600 మండలాలు, 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
ప్రతి గ్రామంలో నిబద్ధత కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తిస్తున్నామని, ప్రతి గ్రామం నుండి కనీసం ఒకరు లేదా ఇద్దరు కార్యకర్తలు ఎన్నికల బృందంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అవసరమైతే ప్రతి గ్రామం నుండి ఈ సంఖ్య మరింత పెరగవచ్చునని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ, తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను వీరు ప్రజల్లోకి తీసుకు వెళ్తారన్నారు.