Mahesh Babu: మహేశ్ సినిమా కోసం కాజోల్ ని రంగంలోకి దింపుతున్న త్రివిక్రమ్!

Kajol in Trivikram Movie
  • మహేశ్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్
  • గతంలో మాదిరిగానే సీనియర్ హీరోయిన్ కి ఛాన్స్  
  • కీలకమైన రోల్ కోసం కాజోల్ తో సంప్రదింపులు
  • ఆమె ఈ సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ టాక్
త్రివిక్రమ్ సినిమాల్లో యాక్షన్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. కామెడీ .. రొమాన్స్ ఇలా అన్ని అంశాలు ఉంటాయి. అలాగే చాలా చిన్న చిన్న పాత్రలలో సైతం క్రేజ్ ఉన్న ఆర్టిస్టులే కనిపిస్తారు. ముఖ్యంగా అమ్మ .. వదిన .. అక్క .. అత్త వంటి పాత్రలలో దాదాపుగా ఆయన సీనియర్ హీరోయిన్స్ ను సెట్ చేస్తూ ఉంటారు. 

అలా నదియా .. స్నేహ .. ఖుష్బూ .. టబూ .. దేవయాని వంటి సీనియర్ హీరోయిన్స్ ఆయన సినిమాల్లో కనిపిస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం మహేశ్ బాబుతో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. 

కాజోల్ ఇంతవరకూ నేరుగా తెలుగు సినిమాలో చేయలేదు. ఇదే ఇక్కడ ఆమె చేసే మొదటి సినిమా అవుతుంది. గతంలో తమిళంలో ఆమె చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. తెలుగులో ఆమె ఈ సినిమా చేయడానికి అవకాశం ఉందని అంటున్నారు. అందుకు కారణం 'ఆర్ ఆర్ ఆర్'తో అజయ్ దేవగణ్ కి హిట్ పడటమేనని చెబుతున్నారు.   

Mahesh Babu
Trivikram Srinivas
Kajol

More Telugu News