ట్విట్టర్ ఖాతాలను ప్రక్షాళన చేస్తున్నాం.. ఫాలోవర్లు తగ్గిపోవచ్చు: మస్క్
- చాలా ఏళ్లుగా వాడకుండా ఉన్న ఖాతాలపై కత్తి
- వాటిని తొలగించనున్నట్టు ప్రకటించిన ఎలాన్ మస్క్
- అది ఘోర తప్పిదం అవుతుందంటూ యూజర్ల అభిప్రాయం
ట్విట్టర్ ఖాతాను తెరిచి కొన్నేళ్లుగా దానిని వాడకుండా వదిలేసిన వారు ఓ సారి మేల్కోవాల్సిందే. అలాంటి ఖాతాలను తొలగించనున్నట్టు మస్క్ తెలిపారు. దీనివల్ల ఫాలోవర్ల సంఖ్యపై ప్రభావం పడుతుందన్నారు. ఎందుకంటే మీ ఫాలోవర్లలో యాక్టివ్ గా లేని ఖాతాలన్నీ కనుమరుగు అవుతాయని, దాంతో ఫాలోవర్ల సంఖ్య తగ్గుతుందని మస్క్ వివరించారు. దీనిపై ఓ యూజర్ సీరియస్ గా స్పందించారు. ఈ చర్య ఘోర తప్పిదం అవుతుందని హెచ్చరించారు. యాక్టివ్ గా లేని ఖాతాల్లో ఎప్పటి నుంచో ఉన్న ట్వీట్లు కూడా డిలీట్ అయిపోతాయన్నారు. దీన్ని తప్పనిసరిగా పునరాలోచించాలని కోరారు.