Nara Lokesh: హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలపై అదనపు భారం తగదంటూ సీఎస్ కు నారా లోకేశ్ లేఖ

Nara Lokesh letter to AP CS
  • హజ్ కు వెళ్లే వారిపై ఒక్కొక్కరికి రూ. 83 వేల అదనపు భారం పడుతోందన్న లోకేశ్
  • హైదరాబాద్ నుంచి వెళ్లేవారికి రూ. 3,05,000 మాత్రమే ఖర్చు అవుతోందని వ్యాఖ్య
  • ప్రభుత్వం తగినంత సబ్సిడీని భరించాలని విన్నపం
హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలపై అదనపు భారం తగదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. హజ్ యాత్రకు సబ్సిడీని ప్రభుత్వం భరించాలని కోరారు. హైదరాబాద్ నుంచి హజ్ కు వెళ్లే యాత్రికులతో పోల్చితే విజయవాడ నుంచి వెళ్లే ఒక్కొక్కరిపై రూ. 83 వేల ఆదనపు భారం పడుతోందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో హజ్ యాత్రకు రూ. 2,40,000 వెళ్లే ఏర్పాటు చేశామని... వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ మొత్తాన్ని రూ.3,88,580 చేసిందని తెలిపారు. పొరుగున ఉన్న హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లాలంటే రూ. 3,05,000 మాత్రమే ఖర్చు అవుతోంది. ఏపీ నుంచి వెళ్లే ఒక్కో ప్రయాణికుడి మీద రూ. 83 వేల ఆదనపు భారాన్ని మోపటం సబబు కాదని అన్నారు. పేద ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగినంత సబ్సిడీని భరించాలని చెప్పారు.
Nara Lokesh
Telugudesam
Huj

More Telugu News