మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

TSRTC good news for women
  • మహిళలకు టీ-24 టిక్కెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయం
  • సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో టిక్కెట్ ధర రూ.90కి తగ్గింపు
  • ఇదివరకే సీనియర్ సిటిజన్లకు, ఇప్పుడు మహిళలకు రూ.10 తగ్గింపు
మహిళలకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీ-24 టిక్కెట్ ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సామాజిక అనుసంధాన వేదిక ద్వారా వెల్లడించారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.100 ఉన్న టీ-24 టిక్కెట్ ధరను సాధారణ ప్రయాణీకులకు రూ.90, సీనియర్ సిటిజన్లకు రూ.80కి అందించాలని నిర్ణయించారు. తాజాగా మహిళలకు రూ.10 తగ్గించి రూ.80కే ఇవ్వనున్నారు. ఇది మంగళవారం నుండి అందుబాటులోకి వస్తోంది.
Go Back to Shorts
Hyderabad
Telangana
tsrtc

More Telugu News