Karthik Rathnam: 'ఛాంగురే బంగారురాజా' లిరికల్ సాంగ్ రిలీజ్!

  • కార్తీక్ రత్నం హీరోగా 'ఛాంగురే బంగారురాజా'
  • రవితేజ సొంత బ్యానర్లో నిర్మితమైన సినిమా 
  • దర్శకుడిగా సతీశ్ వర్మ 
  • కీలకమైన పాత్రలో రవిబాబు
Changure Bangaru Raja lyrical song released

ఈ మధ్య కాలంలో రవితేజ తన సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉంటూ వస్తున్నాడు. ఇక ఇతర హీరోల సినిమాలకి కూడా ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలా ఆయన బ్యానర్లో నిర్మితమైన సినిమానే 'ఛాంగురే బంగారు  రాజా'. కార్తీక్ రత్నం హీరోగా ఈ సినిమా రూపొందింది. 

కార్తీక్ రత్నం జోడీగా గోల్డీ నటించిన ఈ సినిమాకి, సతీశ్ వర్మ దర్శకత్వం వహించాడు. కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'సామి రంగా .. ఎంత అందంగా .. దోచెనే దొంగ .. దాని పేరేమో మంగ' అంటూ ఈ పాట సాగుతోంది. 

కృష్ణ సౌరభ్ స్వరపరిచిన ఈ పాటకి కృష్ణ చైతన్య సాహిత్యాన్ని అందించాడు .. అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. రవిబాబు ... సత్య .. రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. కార్తీక్ రత్నం కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.

More Telugu News