Pawan Kalyan: మహారాష్ట్రలో 'ఓజీ' షూటింగ్... పవన్ ను సర్ ప్రైజ్ చేసిన జనసైనికులు!

Pawan Kalyan says he met Janasainiks at Wai Lake in Maharashtra
  • సుజీత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ 'ఓజీ'
  • ఇటీవల ముంబయి షెడ్యూల్ పూర్తి
  • మహారాష్ట్రలోని ఇతర లొకేషన్లలో చిత్రీకరణ
  • వాయి సరస్సు వద్ద పవన్ ను కలిసిన తూర్పు గోదావరి జనసైనికులు
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'ఓజీ' చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నారు. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ముంబయిలో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న 'ఓజీ'... ప్రస్తుతం మహారాష్ట్రలోని ఇతర లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో కొందరు జనసైనికులు పవన్ ను సర్ ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని పవన్ ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. 

"మహారాష్ట్రలోని వాయి సరస్సు వద్ద 'ఓజీ' షూటింగ్ చేస్తుండగా, మా జనసైనికులు వచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, కోవూరుకు చెందిన సింగిరి సాయి, సింగిరి రాజేశ్, సన్నీ జాన్ లను కలిశాను" అని వివరించారు. 

తూర్పు గోదావరి జిల్లా జనసైనికులు వాయి సరస్సులో ఓ బోట్ వద్ద జనసేన జెండాను ప్రదర్శిస్తుండగా, ఒడ్డున నిల్చున్న పవన్ తదేకంగా ఆ జెండాను వీక్షించారు. ఈ సమయంలో పవన్ మార్షల్ ఆర్ట్స్ దుస్తుల్లో ఉన్నారు. ఈ ఫొటోను కూడా పవన్ ఫేస్ బుక్ లో పంచుకున్నారు.
Pawan Kalyan
Janasainiks
Wai Lake
OG
Shooting
Maharashtra
Janasena
East Godavari District
Andhra Pradesh

More Telugu News