ఢిల్లీ లిక్కర్ స్కామ్.. శరత్ చంద్రారెడ్డికి పూర్తి స్థాయి బెయిల్ మంజూరు

Sharathchandra Reddy gets full bail from Delhi High Court
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి ఊరట లభించింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్న ఆయనకు ఢిల్లీ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ ను మంజూరు చేసింది. తన భార్య అనారోగ్య కారణాల నేపథ్యంలో పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేయాలన్న ఆయన విన్నపం పట్ల హైకోర్టు సానుకూలంగా స్పందించింది. శరత్ చంద్రారెడ్డికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవలే 4 వారాల మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. భార్య అనారోగ్యం నేపథ్యంలో 6 వారాల బెయిల్ ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డి కోరగా... కోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.
Go Back to Shorts
Sharathchandra Reddy
Delhi Liquor Scam

More Telugu News