Pakistan: పాపం పాకిస్థాన్.. రెండు రోజుల ముచ్చటగా నంబర్ వన్ ర్యాంకు.. ఒక్క ఓటమితో మళ్లీ కిందికి!

Pakistan lose No 1 spot in ICC Rankings in 48 hours after New Zealand clinch consolation win in ODI series
  • చరిత్రలో తొలిసారి వన్డేల్లో ఫస్ట్ ర్యాంకును దక్కించుకున్న పాక్
  • న్యూజిలాండ్ తో ఐదో వన్డేలో ఓటమితో.. మళ్లీ కిందికి
  • తొలి రెండు స్థానాల్లో ఆసీస్, టీమిండియా.. మూడో స్థానంలో పాకిస్థాన్
పాపం పాకిస్థాన్ జట్టు.. వన్డేల్లో తొలిసారి నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్నామన్న సంతోషం మూడు రోజులు కూడా లేకుండా పోయింది. కేవలం 48 గంటల వ్యవధిలోనే టాప్ ర్యాంకును కోల్పోయింది. మూడో ర్యాంకుకు పడిపోయింది.

న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచిన పాకిస్థాన్.. తమ జట్టు చరిత్రలోనే తొలిసారి వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకుంది. కానీ రెండు రోజుల్లో న్యూజిలాండ్ తో జరిగిన ఐదో వన్డేలో ఓడిపోయి.. ఫస్ట్ ప్లేస్ ను కోల్పోయింది. చివరికి 4-1తో సిరీస్ ను దక్కించుకున్నామన్న సంతోషంతో సంత‌ృప్తిపడింది.

ఈ ఓటమితో పాకిస్థాన్ ఒక రేటింగ్ పాయింట్ కోల్పోయి 112 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. 113 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. 113 పాయింట్లే ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ 111 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలవగా, 108 పాయింట్లతో న్యూజిలాండ్ ఐదో స్థానంలో నిలిచింది. 101 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఆరో స్థానంలో ఉంది.
Pakistan
ICC Rankings
New Zealand
No 1 Rank
one day cricket
Australia
India

More Telugu News