David Warner: సన్ రైజర్స్ విజయంపై మాజీ సారథి డేవిడ్ వార్నర్ రియాక్షన్

David Warner eye catching reaction on former team Sunrisers Hyderabad goes viral after crazy IPL 2023 win vs RR
  • విల్లు పట్టిన గ్లిన్ ఫిలిప్స్ అంటూ వార్నర్ ట్వీట్
  • సన్ రైజర్స్ గొప్పగా ఆడిందంటూ ప్రశంస
  • తన మాజీ జట్టు ఆటపై వార్నర్ స్పందించడం ఇదే మొదటిసారి
రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య సమరం ఆదివారం అత్యంత ఉత్కంఠగా సాగిందనడంలో ఆశ్చర్యమే లేదు. చివరి బంతి వరకు సస్పెన్స్ కొనసాగింది. చివరి బంతికి సిక్సర్ బాదితే విజయం సన్ రైజర్స్ ను వరిస్తుంది. అబ్దుల్ సమద్ అదే ఊపుతో కొట్టిన షాట్ ను బౌండరీ వద్ద జోస్ బట్లర్ పట్టేయడంతో.. ఒక్కసారిగా రాజస్థాన్ జట్టు సభ్యుల్లో సంతోషం. సన్ రైజర్స్ ఆటగాళ్లలో విషాదం. ఆరేడు సెకండ్లలో అంతా మారిపోయింది. అంపైర్ నో బాల్ ప్రకటించడంతో సందీప్ శర్మ నిరాశతో మరోసారి బాల్ వేయాల్సి వచ్చింది. దీన్ని బంగారం లాంటి అవకాశంగా తీసుకున్న సమద్ సిక్సర్ తో విజయం షురూ చేశాడు.

సన్ రైజర్స్ మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుత కెప్టెన్ డేవిడ్ వార్నర్ సైతం దీనిపై స్పందించాడు. ‘‘ఐపీఎల్ ఎంతో ఉత్తమమైనది, గ్లెన్ ఫిలిప్స్ విల్లు విరిచాడు. సన్ రైజర్స్ గొప్పగా ఆడింది’’ అంటూ డేవిడ్ వార్నర్ స్పందన వ్యక్తం చేశాడు. సన్ రైజర్స్ యాజమాన్యం తనను అవమానకరంగా బయటకు పంపించిందని లోగడ వార్నర్ విమర్శించడం తెలిసిందే. అయినప్పటికీ, వార్నర్ మెచ్చుకునేంతగా సన్ రైజర్స్ ఆటగాళ్లు దుమ్ము దులపడమే హైలైట్ అని చెప్పుకోవాలి. అంతేకాదు సన్ రైజర్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ జట్టు ఆటను వార్నర్ మెచ్చుకోవడం ఇదే తొలిసారి.
David Warner
reaction
Sunrisers Hyderabad
win

More Telugu News