Russia: మా వద్ద బిలియన్ల కొద్దీ భారత కరెన్సీ ఉన్నా వాడుకోలేకపోతున్నాం: రష్యా విదేశాంగ శాఖ మంత్రి

  • రష్యా నుంచి భారత్‌కు భారీగా చమురు దిగుమతులు
  • రష్యా చమురుకు రూపాయిల్లో చెల్లింపులు జరుపుతున్న ఆయిల్ రిఫైనరీలు
  • ఈ డబ్బును వినియోగించుకునేందుకు మరో కరెన్సీలోకి బదిలీ చేయాలన్న రష్యా విదేశాంగ మంత్రి
Russian minister Says they Have Billions Of Indian Rupees That they Cant Use

తమ దేశంలో బిలియన్ల కొద్దీ భారతీ కరెన్సీ ఉన్నా వాడుకోలేకపోతున్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లార్వోర్ ఇటీవల వ్యాఖ్యానించారు. గోవాలో షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ డబ్బును వినియోగించుకోవాలంటే దాన్ని మరో కరెన్సీ రూపంలో బదిలీ చేయాలి. ఈ అంశంపై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

2022-23 ఆర్థిక సంవత్సరంలో రష్యాకు భారత్ ఎగుమతులు కేవలం 2.8 బిలియన్ డాలర్లకు పరిమితం కాగా దిగుమతులు ఏకంగా ఐదు రెట్లు పెరిగి 41.56 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అగ్రరాజ్యం ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో, రష్యా భారత్‌కు చవక ధరలకు చమురును అమ్మడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు రష్యా చమురు దిగుమతులు భారీగా పెరిగాయి. మరోవైపు, డాలర్లలో చెల్లింపులపై కూడా ఆంక్షలు ఉండటంతో భారత్ రష్యాకు రూపాయిల్లో చెల్లింపులు ప్రారంభించింది. 

ప్రస్తుతం భారత్‌లోని ఆయిల్ రిఫైనరీలు రష్యా దిగుమతులపై యూఏఈ దిర్హామ్స్, రూబుల్స్, రూపాయిల్లో  చెల్లింపులు జరుపుతున్నాయి. ఇందుకోసం రష్యన్ బ్యాంకుల్లో ప్రత్యేక వాస్ట్రో అకౌంట్లు తెరిచాయి.

More Telugu News