Virat Kohli: భూతద్దంతో చెక్కను కాల్చి కోహ్లీ చిత్రం రూపొందించిన ఆర్టిస్ట్! చూసి తీరాల్సిన వీడియో!

Artist Draws Virat Kohlis Portrait Using Unique Method Netizens are amazed
  • ఇండియన్ ఆర్టిస్ట్స్ క్లబ్ షేర్ చేసిన వీడియో వైరల్
  • కోహ్లీ చిత్రం గీసిన ఆర్టిస్ట్‌పై నెట్టింట ప్రశంసల వర్షం
  • కళాకారుడి ఓర్పు, నేర్పుకు అబ్బురపడుతున్న నెటిజన్లు
టీమిండియా బ్యాటింగ్ లెజెండ్ విరాట్ కోహ్లీ అభిమానగణం కోట్లల్లో ఉంటారు. అతడిపై తమ అభిమానాన్ని ప్రదర్శించేందుకు వారు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. తాజాగా ఓ ఆర్టిస్ట్ సరికొత్త రీతిలో కోహ్లీ చిత్రాన్ని రూపొందించి ఆయన అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

ఇండియన్ ఆర్టిస్ట్స్ క్లబ్ వారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఇందులో విఘ్నేశ్ అనే ఆర్టిస్ట్ అసాధారణ రీతిలో చెక్కపై కోహ్లీ చిత్రాన్ని గీశాడు. ఇందుకోసం అతడు భూతద్దం ఉపయోగించాడు. దాని సాయంతో చెక్కపై సూర్యకిరణాలను కేంద్రీకరించి బోర్డు ఉపరితలం కాల్చి కోహ్లీ రూపాన్ని డిజైన్‌ను చేశాడు. ఎంతో ఓర్పు, నేర్పుతో ఒడుపుగా అతడు ఈ చిత్రాన్ని గీస్తుండగా తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

ఇప్పటివరకూ ఈ వీడియోకు సుమారు 1.85 లక్షల వ్యూస్ వచ్చాయంటేనే వీడియో ఎంతగా ఆకట్టుకుంటోందో అర్థం చేసుకోవచ్చు. వీడియో చూసిన వారందరూ ఇబ్బడిముబ్బడిగా కామెంట్స్ పెడుతున్నారు. ఆర్టిస్ట్ ఓర్పును, నైపుణ్యాన్ని తెగ ప్రశంసిస్తున్నారు. మరి, ఇంతగా వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!
Virat Kohli
Viral Videos

More Telugu News